రాయికల్

ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలి-డిఆర్డీవో సంపత్ రావు

viswatelangana.com

April 3rd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

ఉపాధి కూలీ పనులు బాగానే జరుగుతున్నప్పటికీ కూలీల సంఖ్య మరింత పెంచాలని జగిత్యాల డిఆర్డీవో (మండల ప్రత్యేకాధికారి) సంపత్ రావు అన్నారు. బుధవారం రాయికల్ మండలంలోని అల్లీపూర్, వీరాపూర్ గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీల వేతనాలు ఏప్రిల్ నెల నుండి 300 రూపాయలకు ప్రభుత్వం పెంచడం జరిగిందని, కూలీల సంఖ్యను పెంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఈ మూడు నెలల్లో కూలీలు 100 రోజులు పని పూర్తి చేసినట్లయితే 30 వేల రూపాయల వేతనము పొందవచ్చునని అన్నారు. అన్ని గ్రామాల్లో అధికారులు ఉపాధి హామీ పనులపై అవగాహన కల్పించాలన్నారు. అటవీ ప్రాంతంలో చేపట్టిన ఖండిత కందకాలు, పార్కులేషన్ ట్యాంక్,హరితవనాల పనులను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. ఎండలు తీవ్రత దృష్ట్యా కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలని ఆశా వర్కర్లకు సూచించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బింగి చిరంజీవి, ఎంపీవో సుష్మా, పంచాయతీరాజ్ ఏఈ సీవీ ప్రసాద్, ఏపీవో దివ్య, టెక్నికల్ అసిస్టెంట్లు విజయ్ కుమార్, రాము, వీణరాణి, కంప్యూటర్ ఆపరేటర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button