ఉపాధ్యాయునికి ఆత్మీయ సత్కారం

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేసిన సిరిపురం మహేష్ మెట్ పెల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ గణితంగా ఉద్యోగ ఉన్నతి పొందిన సందర్భంగా భూపతిపూర్ పాఠశాల నుండి ఘనంగా సన్మానించి ఆయన సేవలను గుర్తు చేసుకొని మునుముందు ఇంకా ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఉమ్మెంతల వెంకటరమణి తాజా మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, ఉపసర్పంచ్ అన్నవేణి వేణు, తాజా మాజీ చైర్మన్ జక్కుల రాజేంద్రప్రసాద్, ఏనుగు రాజారెడ్డి, అనుపథ యూత్ సభ్యులు రమేష్,అంజయ్య మరియు గ్రామ యువత, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు బొల్లె చిన్నయ్య, శంకరయ్య, మహేష్, వంశీధర్ రావు, సురేష్, వేణు, సంజీవ్, హుస్సేన్, కమురుద్దీన్ పుష్పలత, భవాని, సరోజినీ, శైలజ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



