కోరుట్ల

ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…..

viswatelangana.com

September 5th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల మండలం కల్లూరు గ్రామంలోని ఉన్నత ప్రాథమిక పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థిని, విద్యార్థులు, పాఠశాలలో ఉపాధ్యాయయులతో ఎలా మేదగాలి అని విద్యార్థులకు అవగాహన కల్పించారని, కల్లూరు గ్రామ మాజీ సర్పంచ్ వనతడుపుల అంజయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నరహరి అలాగే సహా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొని ఉపాధ్యాయ వృత్తిని గురించి వివరించారన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ సర్పంచ్ మాట్లాడుతూ… ఉపాధ్యాయులు నేర్పే విద్యతోనే మనం డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, శాస్త్రవేత్తలుగా వివిధ రంగాల్లో ఉన్నతమైన స్థానంలో ఉంటున్నాం అందుకు గాను విద్యార్థులు క్రమ శిక్షణతో విద్యను అభ్యసించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఎంపీటీసీ లత రమేష్, విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Related Articles

Back to top button