చిరుధన్యాలు, స్థానిక ఆహార పదార్థాల పైన అవగాహన కార్యక్రమం

viswatelangana.com
జగిత్యాల జిల్లా జగిత్యాల ప్రాజెక్టు పరిధిలోని రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో మహిళా శిశు సంక్షేమశాఖ జగిత్యాల ప్రాజెక్టు సిడిపిఓ మమత అధర్యంలో చిరుదాన్యాలు కొర్రలు, రాగులు, ఉదలు, అరికెలు, సామలు, సజ్జలు, జొన్నలు, అండ్రుకొర్రలు మొదలైనవి స్థానిక ఆహార పదార్థాల పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ మమత మాట్లాడుతూ స్థానికంగా దొరికే ఆహార పదార్థాలు, చిరుధన్యాలను ప్రత్యక్షంగా చూపించి వాటితో ఏ ఏ అనుబంధ ఆహార వంటకాలను తయారు చేయవచ్చునో ప్రత్యక్షంగా తయారు చేసి చూపించారు. మనం ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వలన కలిగే లాభాలను లబ్ధిదారులకు, గ్రామస్థులకు ఒక్కొక్క దాని గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ రాధ, మెడికల్ ఆఫీసర్, జెండర్ స్పెషలిస్ట్ గౌతమి, సఖి కేంద్రం రజిత, అంగన్వాడీ టీచర్లు, గర్భిణిలు, బాలింతలు, పిల్లలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



