రాయికల్
వంతెన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి ఎమ్మార్వో కు వినతి పత్రం

viswatelangana.com
June 19th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రాయికల్ – మైతాపూర్ గ్రామాల మధ్య నిర్మిస్తున్న నూతన వంతెన నిర్మాణం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన పనులు ముందుకు సాగడం లేదు అని వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ తారు రోడ్డు మరియు విద్యుత్ పనులు పూర్తికాలేదు అని అదేవిధంగా వంతెన కింద స్లాబు వేసేటప్పుడు ఏర్పాటుచేసిన సీల్టును తీయకపోవడం వలన గత ఏడాది వరద చాలా దూరం ప్రవహించి బ్రిడ్జి చుట్టూ పోసిన మట్టి కొట్టుకపోయి చాలా వరకు తారు రోడ్డు దెబ్బతిన్నది పనులు ఇలాగే నత్తనడకన కొనసాగితే ఈ సంవత్సరం కూడా వంతెన నిర్మాణం పూర్తి కాదు కావున వంతెన నిర్మాణం త్వరగా పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో గోపి రాజరెడ్డి తలారి రాజేష్ బూస గంగమల్లయ్య నెమిల్ల స్వామి కర్నె నారాయణ ఆకుల లక్ష్మీనారాయణ బొమ్మేన బాబు తదితరులు పాల్గొన్నారు



