నియామక పత్రం

viswatelangana.com
బి.సి మహిళా సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీమతి రాచకొండ రోజా (న్యాయవాది) నియామకం తేది:18-10-2024 శుక్రవారం రోజున హైదరాబాదులో బీసీ ముఖ్య నాయకుల సమావేశం శ్రీ ఆర్. కృష్ణయ్య ఎం.పి ఆధ్వర్యంలో జరిగింది. ఇట్టి సమావేశంలో కోరుట్ల పట్టణానికి చెందిన నాయీబ్రాహ్మణ కులస్తురాలైన శ్రీమతి రాచకొండ రోజా (న్యాయవాది) ని వివిధ సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములైనందుకు, బి.సి లను చైతన్యపరిచినందుకు, మరియు వివిధ బి.సి ఉద్యమాల్లో పాల్గొన్నందుకు గాను బి.సి మహిళా సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీమతి రాచకొండ రోజా (న్యాయవాది)ని నియమించనైనది. బి.సి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎం.పి ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ సూచన మేరకు బి.సి మహిళా సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీమతి రాచకొండ రోజా (న్యాయవాది)ని రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ వీరిని నియమించనైనది. వీరి నియామకం తేది: 20-10-2024 నుండి అమల్లోకి వచ్చునని రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, బిసి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రాంచందర్, బి.సి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కు గంగాధర్, బి.సి సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు రాపర్తి రవి, జగిత్యాల జిల్లా బిసి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు మారిశెట్టి సూర్యప్రకాష్, జగిత్యాల నియోజకవర్గ అధ్యక్షురాలు బండపెల్లి మల్లీశ్వరి వారిని కలిసి అభినందించారు



