కథలాపూర్

ఊట్ పల్లిలో నందీశ్వర నూతన ధ్వజస్తంభం ప్రతిష్టాపన

viswatelangana.com

March 17th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున దేవాలయం వద్ద నందీశ్వర నూతన ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక హోమం, పూజలు నిర్వహించారు. వేదపండితుల వేద మంత్రోచ్చారణల నడుమ ధ్వజ స్తంభాన్ని ప్రతిష్టింపచేశారు. ఈ ధ్వజ స్తంభానికి దాతలుగా నిలిచిన వారికి గ్రామ పెద్ద మనుషులు, గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.23 వ తేదీ రోజున మల్లన్న జాతర ఉన్నందున దేవాలయ అభివృద్ధికి, జాతరకు దాతలు సహాయ, సహకారాలు అందించాలని గ్రామ పెద్దమనుషులు, ప్రజలు కోరారు.

Related Articles

Back to top button