కథలాపూర్
ఊట్ పల్లి గ్రామంలో వృద్ధురాలి మెడలో నుంచి బంగారు ఆభరణాలు లాక్కెళ్ళిన ఇద్దరు మహిళా దొంగలు

viswatelangana.com
February 12th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊటుపల్లి గ్రామంలో గజెల్లి లక్ష్మి అనే వృద్ధురాలి మెడలో నుంచి ఏడు తులాల బంగారు ఆభరణాలను బుధవారం మధ్యాహ్నం ఇద్దరు మహిళా దొంగలు లాకెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు. లక్ష్మి అనే వృద్ధురాలు ఇంట్లో ఉండగా.. ఆధార్ కార్డు పరిశీలిస్తామని చెప్పి ఇద్దరు మహిళలు మాట్లాడుతూ వెంటనే వృద్ధురాలి మెడలో నుంచి బంగారు ఆభరణాలు లాక్కెల్లారు. పోలీసులు వచ్చి వివరాలు సేకరిస్తున్నారు.



