viswatelangana.com
Date of Publish : 09 November 2024, 3:31 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఊట్ పల్లి గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృషి తో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.ఊట్ పల్లి గ్రామానికి చెందిన జవ్వాజి గంగారాం 60,000/- రాచర్ల రాజమల్లయ్య 60,000/, సుంకరి సత్తమ్మ 17,500/-, ఉయ్యాల లోహిత 13500/- చెక్కులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ముదాం శేఖర్, నాయకులు పాల నవీన్, మహేష్ సంజీవ్, గంగారెడ్డి, నర్సయ్య, మల్లయ్య, మల్లేశం, గణేష్, వినయ్, శ్రీనివాస్, శశి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Change News Type