రైసింగ్ హై స్కూల్ లో ఘనంగా మెగా సైన్స్ ఫేర్
-సర్ సీవీ రమణ పుట్టిన రోజు సందర్బంగా స్కూల్ లో సైన్స్ ఫెయిర్
viswatelangana.com
కోరుట్ల పట్టణంలో రైసింగ్ హై స్కూల్ లో జాతీయ సైన్స్ ఫెయిర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెగా సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యం ఈ ఓ మహమ్మద్ అబ్దుల్ మజీద్ , విచ్చేసిన సైన్స్ ఫేర్ ఎగ్జిబిషను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన వర్కింగ్ మోడల్స్ ను వీక్షించి, చిన్నారులను అభినందించారు. ఈ సందర్భంగా యం.ఈ.ఓ మాట్లాడుతూ విద్యార్థులు తమలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి అద్భుతమైన ప్రాజెక్టు లను రూపొందించారని విద్యార్థులను చూస్తూ ఉంటే బాల శాస్త్రవేత్తలుగా కనిపిస్తున్నారని అన్నారు. అనంతరం యం.ఈ.ఓ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలు చేయడం చాలా బాగుందని అన్నారు. 70 కి పైగా వర్కింగ్ మోడల్స్ చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండంట్ కూడేలా రాజేంద్ర ప్రసాద్, ప్రిన్సిపాల్ కూడేలా లిఖిత, డైరెక్టర్ చిప్ప మోహన్, ఉపాధ్యాయ బృందం, శైనాజ్ బేగం, వేనెల్ల,మమతా, టాబస్సుమ్, లత,కవిత, భూమిక, మౌనిక, శివాని, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



