ఆర్టీసీ బస్సు పునరుద్ధరించాలని ఎమ్మెల్యేకు వినతి

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం చెర్ల కొండాపూర్ గ్రామం కు జగిత్యాల డిపోకు చెందిన బస్సును జగిత్యాల్ టు చెర్ల కొండాపూర్ ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని శాసనసభ్యులు డాక్టర్ ఎం సంజయ్ కుమార్ కు వినతి పత్రం ఇచ్చారు. గతంలో జగిత్యాల డిపో బస్సు చెర్ల కొండాపూర్ కు మరియు కోరుట్ల డిపోకు చెందిన బస్సు కోరుట్ల టు చెర్ల కొండాపూర్ ఉదయం సాయంత్రం ఆర్టీసీ బస్సు నడిచేదని,అట్టి బస్సులను రద్దుచేసి చాలా రోజులు అవుతుందని బస్సు లేక చెర్ల కొండాపూర్ ప్రజలు విద్యార్థులు మహిళలు వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారని, పెద్ద చెరువు కట్టమీద నుండి రాయికల్ నడిచి వెళ్లాల్సి వస్తుందని మాజీ సర్పంచ్ శ్రీ అల్లకొండ సుదర్శన్ ఎమ్మెల్యే కు విన్నవించారు. ఈ విజ్ఞప్తికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మ్యాకల కాంతారావు, మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు పిప్పోజి మహేందర్ బాబు పాల్గొన్నారు.



