టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జగిత్యాల జిల్లా కాంగ్రెస్ నాయకులు
viswatelangana.com
దుబాయ్ లో జరిగిన ప్రవాస భారతీయుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మంగళవారం నాడు హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు చేరుకున్న టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేష్ కుమార్ గౌడ్ ను జగిత్యాల జిల్లా కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. గల్ఫ్ కార్మికుల సమస్యలపై అధ్యయనం చేసి వారి సమస్యలు పరిష్కరించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి విజయానికి మద్దతు ఇస్తామనీ, గెలుపులో తమ వంతు పాత్ర పోషిస్తామని గల్ఫ్ కార్మికులు హామీనిచ్చినట్లు తెలిపారు. గాంధీభవన్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి శేర్ నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



