బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో బిజెపి విఫలం
viswatelangana.com
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు
కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీడీ పరిశ్రమపై ఉక్కు పాదం మోపి కార్మికుల హక్కుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఏఐటీయూసీ అనుబంధ బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు అన్నారుగురువారం రోజున సి ప్రభాకర్ భవన్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సమావేశంలో మాట్లాడుతూ బీడీ పరిశ్రమపై అనేక ఆంక్షలు నిబంధనలు విధిస్తూ కార్పొరేట్ బహుళ జాతి కంపెనీలైన సిగరెట్ కంపెనీలకు అప్పజెప్పాలని కుట్ర పనుతుందని అన్నారు బీడీ ఫ్యాక్టరీలో ఆకు బీడీ సరఫరా తంబాకు లాంటిపై జీఎస్టీ 28 శాతం విధించింది అన్నారు బీడీ కట్టప్ప 80% డేంజర్ గుర్తులు ముద్రించాలని విధించిందని అన్నారు. కేంద్రంలో ఈపీఎఫ్ వడ్డీ రేటును 12 నుండి 8 శాతం తగ్గించిందని అన్నారు వీడి సంక్షేమ పథకాలైన బీడీ స్కాలర్షిప్లు పీఎం ఆవాజ్ యోజన పథకం కింద వచ్చే ఇండ్లను కూడా మంజూరి చేయడం లేదన్నారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యవసర వస్తువుల ధరలు దేశ ప్రజలపై పెంచి బారoమోపిందన్నారు కనీస వేతనాల జియోల అమలు చేయాలని కనీస పెన్షన్ 10000 రూపాయలు ఇవ్వాలని బీడి రంగ యాక్ట్ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల పాలన జాయింట్ ప్లాట్ఫారం ఆఫ్ ట్రేడ్ యూనియన్ సంయుక్తంగా నిర్వహించే దేశవ్యాప్త సమ్మె గ్రామీణ భారత్ బంద్ లో ఆరు లక్షల మంది బీడీ కార్మికులు పాల్గొంటారని చెప్పారు ఈ సమావేశంలో టీఎస్ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు సామల మల్లేశం ఎండి ముక్రం కొక్కుల శాంత కేవీ అనసూయ భోగ గోవర్ధన్ గోదావరి శ్రీనివాస్ రంగారెడ్డి భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు



