కథలాపూర్
ఎంపిటీసి పదవీ కాలం పూర్తి చేసుకున్న పులి శిరీష హరిప్రసాద్ కి ఘన సన్మానం

viswatelangana.com
July 4th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలం పోతారం ఎంపిటీసి పులి శిరీష పదవీ కాలం ముగియడంతో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ ప్రతి పక్షo లో వున్నప్పుడు పోటీచేసి కాంగ్రెస్ పార్టీ సహకారంతో గెలిచి పార్టీని విడకుండా కాంగ్రెస్ పార్టీకి పోతారం ప్రజలకు సేవలు అందించారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, ఎండీ అజిమ్, పూండ్ర నారాయణరెడ్డి, వర్దినేని లింగరావు, మోతుకురి చిన్న ఆంజగౌడ్, జవ్వాజి చౌదరి, వంగ మహేష్ వేముల కృష్ణ, ఎండీ, మొయినోద్దీన్, బాలే నీలకంఠం, మాల్యాల రాము, ఓబుళాపురం తుక్కరాం, తలారి మోహన్ ముదాం శేఖర్,పాల నవీన్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



