కథలాపూర్

ఎంపీపీఎస్ భూషణరావుపేటలో కథలాపూర్ కాంప్లెక్స్ లెవల్ క్విజ్ పోటీ బాల మేధ

viswatelangana.com

April 4th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేట లో గురువారం రోజున కథలాపూర్ కాంప్లెక్స్ లెవల్ క్విజ్ పోటీ బాల మేధ కార్యక్రమాన్ని ఎంపీపీఎస్ భూషణరావుపేట లో ఘనంగా నిర్వహించారు. ఇట్టి క్విజ్ పోటీలలో మొదటి బహుమతి ఎంపీపీఎస్ ఊట్ పల్లి పాఠశాల, ద్వితీయ బహుమతి ఎంపీయుపిఎస్ పోసానిపేట్ పాఠశాల మరియు తృతీయ బహుమతి ఎంపీయుపిఎస్ దుంపేట పాఠశాల విద్యార్థులు గెలుపొందారు. ఇట్టి కార్యక్రమములో గెలుపొందిన విద్యార్థులకు మండల విద్యాధికారి ఆనంద రావు, కథలాపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎం అర్జున్, ఎఎంవో రాజేశ్ మరియు మండల నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్ లు బహుమతులతో పాటు పాల్గొన్న విద్యార్థులందరికి పుశంసా పత్రాలు అందజేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సహకాన్ని జవిడి సంతోష్ రెడ్డి మరియు ముస్కు శ్రీనివాస్ రెడ్డి లు అందించారు. ఈ కార్యక్రమములో జెడ్పీ హెచ్ ఎస్ భూషణరావు పేట ప్రధానోపాధ్యాయులు రాజయ్య , జెడ్పీహెచ్ ఎస్ చింతకుంట ప్రధానోపాధ్యాయులు రవి, జెడ్పీ హెచ్ ఎస్ అంబారిపేట ప్రధానో పాధ్యాయులు కిషన్ రావు, అలాగే కథలాపూర్ కాంప్లెక్స్ పరిధిలోని వివిధ ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విష్ణు , శ్రీనివాస్ రెడ్డి , పరమేశ్వర్, కృష్ణారావు ,రవి, రాజశేఖర్, సాయిదివ్య, నాగరాణి, అరుణ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button