కథలాపూర్

కె ఎం పి ఎన్ సీజన్-2 ను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది

viswatelangana.com

March 20th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

కథలాపూర్ మండలం భూషణ్రావుపేట గ్రామంలో కథలాపూర్ మండల ప్రీమియం లీగ్ ( కె ఎం పి ఎన్) సీజన్-2 ను ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు గంజాయి మత్తుకు అలవాటు కావద్దని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క యువకుడు ఏదో పని చేస్తూ లేదా ఆట ఆడుతూ చెడు అలవాట్లపైకి దృష్టి పోకుండా ఉండాలని యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితీ నాగరాజు, పులి హరిప్రసాద్, చెదలు సత్యనారాయణ వెగ్యారపు శ్రీహరి, గోపిడి ధనుంజయ్ రెడ్డి, వాకిటి రాజారెడ్డి, గడ్డం భూమారెడ్డి, కూన శ్రీనివాస్, గాండ్ల స్వామి, గడ్డం చిన్నారెడ్డి, తలారి మోహన్, పాల్తెపు గంగారాం, లోక నర్సారెడ్డి, బోదాసు నర్సయ్య, అంబటి రాధాకృష్ణ, ముద్రకోల అనిల్, మానత్తుల మహిపాల్, వేల్పుల మల్లేశం, గోపిడి మారుతి రెడ్డి(జీఎంఆర్), మార్గం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button