కథలాపూర్
ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే రైతు బంధు మరియు వరి పంట బోనస్ ప్రకటించాలి
సీఎం కు లేఖ పంపిన రైతు ఐక్య వేదిక నాయకులు

viswatelangana.com
February 26th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల ఐక్య వేదిక తరపున నాయకులు బద్దం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతు బంధు 15, 000 రూపాయలు ఇస్తామని, మూడు పంటలకు మరియు వరి పంట కు 500 బోనస్,2 లక్షల రుణ మాఫీ చేస్తామంటే నమ్మి ఓట్లు వేసిన రైతులను నట్టేట ముంచొద్దని ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రభుత్వం చిత్తశుద్ధి ని నిరూపించుకోవాలని అన్నారు.అనంతరం లెటర్ రాసి సీఎం కార్యాలయానికి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపడం జరిగింది.ఈ కార్యక్రమంలో రైతు ఐక్య వేదిక కథలాపూర్ నాయకులు బద్దం మహేందర్ రెడ్డి,పుర్కుటపు సంతోష్ రెడ్డి,ముస్కు కృష్ణ, పుర్కుటపు నరేందర్,మిట్టపెల్లి గంగారెడ్డి, మెగ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.




