viswatelangana.com
Date of Publish : 19 March 2025, 7:00 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఎంపీ నిధుల కేటాయించడంతో హార్షం వ్యక్తం చేసిన బిజెపి కథలాపూర్ మండల శాఖ….

కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కథలాపూర్ మండలంలోని నాలుగు గ్రామాలకు ఎంపీ నిధులను కేటాయించడంతో బిజెపి మండల శాఖ,బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. సిరికొండ, తాండ్రియాల, కథలాపూర్ గ్రామాలకు బోర్ మోటార్,దులూర్ రజక సంఘ భవనానికి 9 లక్షల రూపాయలు విడుదల చేయడం పట్ల పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్,వేములవాడ నియోజకవర్గ నాయకులు చెన్నమనేని వికాస్ రావు లకు బీజేపీ మండల శాఖ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు మల్యాల మారుతి, సీనియర్ నాయకులు వెంకటేశ్వర్ రావ్, బద్రి సత్యం,కథలాపూర్ మహేష్, కాసోజీ ప్రతాప్,నరెడ్ల రవి,గడ్డం జీవన్ రెడ్డి, తెడ్డు మహేష్ పాల్గొన్నారు.

Change News Type