ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించాలి

viswatelangana.com
దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆశయ సాధనకు కృషి చేయాలని నిజామాబాద్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అడ్ హక్ కమిటీ సభ్యులు సోమ నారాయణరెడ్డి అన్నారు. శనివారం రాయికల్ పట్టణ కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ జెండా ఆవిష్కరించి తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం స్వీట్లు,పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీని పెట్టిన తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి రావడం జరిగిందని కొనియాడారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, గృహ నిర్మాణాలు, జనతా వస్త్రాలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. నేటికీ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల హృదయాలలో స్థిర స్థాయిగా నిలిచి ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోర గణేష్, బొల్లారం రాజేశం, గోనె భూమేశ్వర్, నామని లక్ష్మీ నర్సయ్య, మహమ్మద్ సాహెబ్ హుస్సేన్, కల్లెడ రాజారెడ్డి, ఎండి మున్వర్, సిహెచ్ కాశీరాం, బద్దం శేఖర్, యూనిస్ ఖాన్, కొత్తపెల్లి హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.



