కథలాపూర్

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది

viswatelangana.com

April 27th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

వేములవాడ నియోజకవర్గంలోనికథలాపూర్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ తాను ఎంపీ గా ఉన్నప్పుడు ఢిల్లీలో గౌరవం పెంచానని, ప్రజల ఆశీర్వాదంతో హుస్నాబాద్ ఎమ్మెల్యే గా మంత్రి చేస్తున్నానని ఆది శ్రీనివాస్ ను ఎమ్మెల్యే గా ప్రభుత్వ విప్ గా ప్రజలు ఆశీర్వదించారని ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రవాణా మంత్రి గా మహిళలకు ఆర్టీసీఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రు కే సిలిండర్, 10 లక్షల ఆరోగ్య శ్రీ ఇస్తున్నామని త్వరలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు, గతంలో సూరమ్మ ప్రాజెక్ట్ గురించి నిరసనలు చేశామని ఇప్పుడు పూర్తి చేస్తామని, కొత్త రేషన్ కార్డులు, ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ, వచ్చే వర్షాకాలం పంట లోపు 500 బోనస్ ఇస్తామని అన్నారు. రాష్ట్ర విభజన కి ముందు 60 వేల కోట్ల అప్పు ఉంటే గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసింది. బిజెపి నల్లధనం తెచ్చి పేదల ఖాతాలో 15 లక్షలు వేస్తామని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నారని కానీ ఏవి కూడా చెయ్యలేదన్నారు. కాంగ్రెస్ వస్తె ముస్లింలకు సంపద పంచిపెడతరని అబద్ధాలు చెబుతూ వాళ్ళు అదానీ, అంబానిలకు పంచిపెట్టారని రాముడి ఫోటో పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని దేవుడు గుళ్ళో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలని బీజేపీ అభ్యర్థి చదువురాని వ్యక్తి, ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు చదువుకున్న వ్యక్తి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లు దేశం కోసం ప్రాణాలు అర్పించారని కానీ నరేంద్ర మోడీ భార్య తో ఉండలేరని. ఇక్కడ బీజేపీ నేతలు తల్లికి గౌరవం ఇవ్వరని అన్నారు. ఇక్కడ ఉన్న 227 బూత్ లలో మెజారిటీ తెచ్చే విధంగాఅందరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు వేసి రాజేందర్ రావు ని గెలిపించాలని అన్నారు.

Related Articles

Back to top button