ఎమ్మార్పిఎస్ కథలాపూర్ మండల అధ్యక్షునిగా మారంపెల్లి వినోద్
viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో ఎమ్మార్పిఎస్ మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా మారంపెల్లి వినోద్, ఉపాధ్యక్షునిగా ఆమేటి రాజేష్, ప్రధాన కార్యదర్శి గా తెడ్డు ప్రశాంత్, గౌరవ అధ్యక్షునిగా తెడ్డు శేఖర్ తదితరులు ఎన్నికయ్యారు. నూతనంగా నియమితులైన అధ్యక్షుడు మారంపెల్లి వినోద్ మాట్లాడుతూ నియామకానికి సహకరించిన రాష్ట్ర నాయకత్వానికి, మండల నాయకత్వానికి మరియు అన్ని గ్రామాల మాదిగ కుల సంఘ పెద్దలందరికి కృతజ్ఞతలు. నా మీద నమ్మకం తో ఎన్నిక చేసినందుకు పూర్తి స్థాయిలో క్రమశిక్షణ తో బాధ్యతలు నిర్వర్తిస్థానని అన్నారు. ఉపాధ్యక్షుడు ఆమేటి రాజేష్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎమ్మార్పిఎస్ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎమ్మార్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆవునూరి ప్రభాకర్ మాదిగ, రాష్ట్ర నాయకులు గుండ్రెడ్డి రాజు మాదిగ, రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ ఎలగందుల బిక్షపతి మాదిగ, సావనపెల్లి రాకేష్ మాదిగ, జగిత్యాల జిల్లా ఇంచార్జి కాశవత్తుల లక్ష్మీరాజం,కలిగోట రాజం, శనిగారపు గణేష్, బాలె నీలకంఠం, బాలు, గంగాధర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.



