కథలాపూర్

ఎమ్మార్పీఎస్ 31, వ ఆవిర్భావ దినోత్సవం మరియు గౌరవ పద్మ శ్రీ అవార్డు గ్రహీత శ్రీ మంద కృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

viswatelangana.com

July 7th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

కథలాపూర్ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మారంపెల్లి వినోద్ మాదిగ అధ్యక్షతన ఎమ్మార్పీఎస్ 31, వ ఆవిర్భావ దినోత్సవం మరియు గౌరవ పద్మ శ్రీ అవార్డు గ్రహీత శ్రీ మంద కృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా జగిత్యాల ఇంచార్జీ జిల్లెళ్ళ మురళీ మాదిగ మాట్లాడుతూ సామాజిక ఆర్థిక రాజకీయ అసమానత లు లేని నూతన సమాజ నిర్మాణం కోసం కాంక్షిస్తూ ఎమ్మార్పీఎస్ ఉద్యమం తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని అన్నారు. జగిత్యాల జిల్లా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కసవత్తుల లక్ష్మి రాజం మాట్లడుతూ మాదిగ సమాజానికి దక్క వలిసిన రిజర్వేషన్ హక్కుల కోసం పోరాడుతూనే మరోవైపు నిరాదరణ కు గురైన వర్గాలైన వికలాంగులు, వృద్దులు, వితంతువుల, కోసం పోరాడి వారికి పెన్షన్ల పెంపుదలకై ఉద్యమం నిర్వహించారని గుర్తు చేశారు. గుండె జబ్బుల చిన్నారులకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత ఆపరేషన్లు, అయ్యేలా కృషి చేశారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు, తెలంగాణ అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు, మహిళ భద్రత కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, తెల్ల రేషన్ కార్డు ప్రజలకు ఆకలి కేకలు అనే కార్యక్రమం నిర్వహించి అప్పటి ప్రభుత్వంతో పోరాడి నాలుగు కిలోల నుండి 6, కిలోల బియ్యం పెంపుదలకై ఉద్యమం నిర్వహించారని అన్నారు.. ఈ ఫలాలు కేవలం మాదిగల కోసం చేసినవి కావని, అన్ని వర్గాల సంక్షేమం కోసం సామాజిక బాధ్యతతో చేసిన ఉద్యమలని అన్నారు. కాబట్టి సమాజ హితమే ధ్యేయంగా ఎమ్మార్పీఎస్ పోరాడుతుందని అన్ని వర్గాల ప్రజలు గుర్తించాలని అన్నారు. మాదిగల కోసం గత 30 సంవత్సరాల నుండి అలుపెరుగని పోరాటాలు ధర్నాలు, రాస్తారోకోలు చేసి వర్గీకరణ సాధించా మని అన్నారు. రాజీలేని పోరాటం విజయవంతమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ఎస్సీ, వర్గీకరణ అమలు జరుగుతుందని అన్నారు. ఈ విజయానికి కారణం ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు అందించిన సహకారమే నని అన్నారు. దేశంలో ఎన్నో కుల ఉద్యమాలు పుట్టిన ప్పటికీ లక్ష్యం సాధించే వరకు ఏ ఉద్యమం నిలబడలేక పోయాయని అన్నారు. ఎమ్మార్పీఎస్ మాత్రమే సజీవంగా నిలబడి లక్ష్యం చేరిందని దానికి సమాజం ఇచ్చిన సహకారమే ప్రధాన కారణమని అన్నారు. సమాజానికి కృతజ్ఞతగా భవిష్యత్ ఉద్యమ కార్యాచణతో ముందుకు సాగు తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మారంపల్లి వినోద్ మాదిగ, తెడ్డు అంజయ్య గారు మిట్టపెల్లి కిషన్ గారు తరి రవి ప్రభాకర్, వినీత్, స్వామి, నర్సయ్య, గౌతం, అంకయ్య, మాదిగ సంఘం పెద్దమనుషులు మరియు ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button