రాయికల్
ఎమ్మార్వో కు వినతి పత్రం
viswatelangana.com
August 29th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామం లోని కోరుట్ల రోడ్ లో ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర పరం పోగు భూమిలో రజక సంఘం వారు అక్రమ నిర్మాణం చేపడుతున్నారు. అట్టి భూమిలో గత 40 సంవత్సరాలుగా ఊరికి సంబంధించిన బర్లు అందులో నిలబడం జరుగుతుందని, వీరు అక్రమ కట్టడం వల్ల ఊరికి సంబంధించిన బర్లు నిలపడానికి ఆధారం పోతుందని తమకు న్యాయం చేయాలని మైతాపూర్ గ్రామస్తులు ఎమ్మార్వో కు ఫిర్యాదు చేయడం జరిగింది.



