viswatelangana.com
Date of Publish : 18 September 2024, 1:29 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు రుణ మాఫీ చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన జగిత్యాల జిల్లా బి.ఆర్.ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు..

కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ మూడు విడతలుగా చేసినప్పటికీ రైతులకు ఇంకా రుణమాఫీ కాక రాష్టంలో జిల్లాల వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారని రేషన్ కార్డ్, ఆధార్ కార్డు, కుటుంబ ధ్రువీకరణ పత్రం అంటూ సభ్యులకు సాకు చూపెడుతూ చాలామంది రైతులకు రుణమాఫీ చేయకుండా రైతులతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు.. దీంతో రుణమాఫీ అవుతుందో కాదో అని రైతులు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నారని, ఇటీవలే ఒక రైతు ప్రభుత్వం కార్యాలయ ప్రాంగణంలో ఆత్మహత్య చేసుకుని మరణించడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు..రెండు లక్షలకు పైగా రుణమున్న రైతులకు నాలుగో విడతలో రుణమాఫీ చేస్తారని చెప్పారు కానీ ఇంతకు రుణమాఫీ కాక రైతులు బ్యాంకులు వ్యవసాయ అధికారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని, రైతులకు వారి యొక్క రుణాన్ని వెంటనే మాఫీ చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.. ఈ కార్యక్రమంలో వారితోపాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ దావవసంత సురేష్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవి శంకర్, డిసిఎంస్ ఛైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Change News Type