ఎల్ఓసి మంజూరుకు కృషి..ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు

viswatelangana.com
కోరుట్ల పట్టణ రవీంద్ర రోడ్ కాలనీకి చెందిన సబీనా బేగం అనారోగ్య సమస్య వలన అత్యవసర చికిత్స అవసర ఉన్న విషయం తెలుసుకున్న కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు దృష్టికి రాగానే, ఈ విషయాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు తెలుపగా తక్షణమే స్పందించి నిమ్స్ ఆస్పత్రిలోని వైద్య సిబ్బందితో చర్చలు జరిపి ప్రత్యేకమైన చికిత్స అందించవలసిందిగా కోరుతూ ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం వెంటనే వైద్య ఖర్చుల నిమిత్తం 2 లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసిని సబీనా బేగం కుటుంబ సభ్యులైన పీర్ మమ్మద్ కు అందజేయడం జరిగింది. అత్యవసర ఆరోగ్య చికిత్స నిమిత్తం ఎల్ఓసి మంజూరుకు కృషిచేసిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు సబినా బేగం కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



