ఎల్లారెడ్డి పేటలో మీడియా సమావేశం లో ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

viswatelangana.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేటీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం, మాంసం, మటన్ పంచను అని చెప్పి మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో పంచడంలో అంతర్యమేమిటని, తన పరిపాలనలో ప్రజల నాడిని పసిగట్ట లేని కేటీఆర్,గత ఎన్నికల్లో కూడా డబ్బులు పంచ అని చెప్పి ఆ ఎన్నికల్లో కూడా డబ్బులు పంచి గెలుపొందారని, లోక్సభ ఎన్నికల్లో మూడవ స్థానంలో బిఆర్ఎస్ పరిమితమవుతుందని తెలిసి విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసిన కేటీఆర్ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని, సిరిసిల్ల శాసన సభ్యులుగా, గతంలో మంత్రిగా చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లు అడగాల్సింది పోయి, రాష్ట్రంలో బిఆర్ఎస్ ఓడిపోతుందని డబ్బులను విచ్చలవిడిగా పంపిణీ చేశారని,మద్యం, మటన్, మాంసము వీటికి నేను దూరమని చెప్పి నైతిక విలువలతో రాజకీయం చేస్తానని గొప్పలు చెప్పి ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి ఏమైందని, దీన్ని బట్టి చూస్తే అప్పుడే మీరు ప్రజల్లో పలుచన అయిపోయారని మీ ఆత్మ చెప్పిందా, మీ పరపతిని కాపాడడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.