గడి పాఠశాల కోరుట్లలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు…

viswatelangana.com
ప్రాథమిక పాఠశాల యస్.ఆర్.యస్.పి క్యాంప్ గడి పాఠశాల కోరుట్లలో మంగళవారం రోజున ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిపారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినీలు రంగు రంగుల పువ్వులు తెచ్చి బతుకమ్మను పేర్చారు. ఈ మేరకు పాఠశాల విద్యార్థినులు అలాగే ఉపాధ్యాయులు బతుకమ్మ పాటలపై ఆడి పాట పాడారు. బతుకమ్మ మంచిగా పేర్చిన విద్యార్థినిలకు వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు భూసా మాధురి మొదటి ప్రైస్, హరిప్రియ, రెండవ బహుమతి, దీక్షిత, మూడవ బహుమతి వేదిక లను బహుమతుతులు ప్రదానం చేశారు. ఒకటవ, రెండవ తరగతుల విద్యార్థులకు అంకుల్ కిరణం జనరల్ స్టోర్ బుస రాజేంద్ర ప్రసాద్ పలకలు ప్రదానం చేసారు. అనంతరం ఊరేగింపుగా వెళ్లి సమీపంలోని వాగులో బతుకమ్మలను నిమజ్జనం చేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు, ఉపాధ్యాయులు పూర్ణ చందర్, సురేందర్, సురేఖ, ఫాతిమా, ధన లక్ష్మి, వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు బుస మాధురి, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.



