నటరాజ్ కు గురుజ్యోతి జాతీయ అవార్డు 2025

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన డా.బోదనపు నటరాజ్ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో పదమూడు సంవత్సరాలుగా ఉపన్యాసకులుగా పనిచేస్తూ, ఎందరినో ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దుతున్నందుకు గాను మరియు కళారంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల అనుభవంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని, విద్యార్థుల్లో కళా నైపుణ్యాలను పెంపొందిస్తూ మరియు సామాజిక సేవల్లో పాలుపంచుకుంటూ పలు అవార్డులు సొంతం చేసుకుంటున్నాడు.ఇలాంటి సేవలను గుర్తించి నటరాజ్ కు గ్లోబల్ ఆర్గనైజేషన్ విశాఖపట్నం వారు, విజయవాడలో అలంకార్ ఫైవ్ స్టార్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గురుజ్యోతి జాతీయ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు డాక్టర్ విప్పర్తి ఇసాక్ న్యూటన్ పాండు మరియు ప్రోగ్రాం ఆర్గనైజర్ కాసంశెట్టి కృష్ణమూర్తి పాల్గొన్నారు.ఈ అవార్డును అందుకున్న నటరాజ్ ను రష్మీధర తేజ కళాశాల యాజమాన్యం మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ పీచర వేణుగోపాలరావు, ఉపన్యాసకులు ధనూరి శ్రీనివాస్ ,అజీజ్, తుమ్మనపల్లి రాజేంద్రప్రసాద్, లక్ష్మీనారాయణ,హజియా మరియం మరియు తదితర కళాకారులు నటరాజ్ ను అభినందించారు.



