రాయికల్
ఎస్ఎస్సి 2024 ఫలితాలలో మూటపల్లి పాఠశాల విద్యార్థుల ప్రతిభ

viswatelangana.com
April 30th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
పదవ తరగతి విద్యార్థుల పరీక్ష ఫలితాలలో మూటపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణతను వరుసగా రెండవసారి సాధించి ప్రతిభను చాటారు రామిలి విహారిక 9.8 జిపిఎతో స్కూల్ టాపర్ గా మరియు జెడ్పిహెచ్ఎస్ పాఠశాలల్లో మండల టాపర్గా నిలిచింది. బట్టు మైత్రి 9.7 జిపిఏ పాయింట్స్ తో సెకండ్ టాపర్ గా నిలిచింది పరీక్షకు హాజరైన14 విద్యార్థులలో ఐదు మంది విద్యార్థులు 9.0 ఆపైన జిపిఏ సాధించి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నిలిచారు . పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినీ విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దాచేపల్లి లక్ష్మీ దీప మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అభినందించారు.



