viswatelangana.com
Date of Publish : 12 March 2024, 3:35 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఎస్ఎoసీ చైర్మన్ కు ఘన సన్మానం

రాయికల్ మండలం భూపతిపూర్ ఉన్నత పాఠశాలలో నాలుగు సంవత్సరాలు పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గా పని చేసిన జక్కుల రాజేంద్ర ప్రసాద్ ను మంగళవారం ఘనంగా సన్మానించారు. ప్రసాద్ దాతలు, గ్రామ నాయకులు , పూర్వ విద్యార్థుల సహకారం తో పాఠశాల అభివృద్ధిలో క్రియాశీల పాత్ర పోషిస్తూ, గ్రామానికి పాఠశాలకు మధ్య వారధిగా ఉంటూ, పాఠశాల ఉన్నతికి దోహదపడి, మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి కి కృషి చేశారని వక్తలు కొనియాడారు. అనంతరం పాఠశాల లో పదవ తరగతి విద్యార్థులు తొమ్మిదో తరగతి విద్యార్థులు వీడ్కోల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు యువీ రమణి, తాజా మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, వ్యవసాయ సహకారం సంఘం అధ్యక్షులు ముత్యం రెడ్డి, రామస్వామి, చిన్నయ్య, శంకరయ్య, మహేష్, గంగాధర్, తిరుమల, కార్తీక్, గంగారాజం, శ్రీనివాస్, నర్సయ్య లు పాల్గొన్నారు.

Change News Type