కోరుట్ల
ఎస్సారెస్పీ కెనాల్ లో గుర్తు తెలియని మృత దేహం

viswatelangana.com
April 3rd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దాపూర్ గ్రామ శివారులోగల ఎస్సారెస్పీ-36 కెనాల్ లో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. గ్రామస్థులు అటు వైపు వెళ్తుండగా మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడు అందాద (30-40) సంవత్సరాల లోపు ఉండవచ్చని ఆయన తెలిపారు. అతడు నల్లని టీ రంగు షర్టు, నల్లని లోయర్ దుస్తులు ధరించి ఉన్నాడని తెలిపారు. మృతదేహం పూర్తి వివరాల కోసం ఈ క్రింది నంబర్ లను సంప్రదించాలని ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు.
CI Korutla: 8712656820
SI Korutla: 8712656790



