ఘణంగా సేవాలాల్ 285వ జయంతి
viswatelangana.com
గిరిజన మత గురువు సేవాలాల్ 285వ జయంతి ని కోరుట్ల పట్టణంలోని బంజారా నగర్ కాలనీలో ఘనంగా జరిపారు. ఈ సందర్బంగా కార్యక్రమం లో పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్ పుప్పాల ప్రభాకర్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కి వారిని సరైన మార్గం లో నడిపించడానికి మార్గదర్శనం చేసిన మత గురువు సేవాలాల్ మహారాజ్ అని అన్నారు.అలాగే కాలనీ వాసులు ఫూల్ సింగ్ నాయక్ మాట్లాడుతూ మా కుల గురువు మాకు మంచి, చేడులను భోధించి మేము ఒక మంచిమార్గంలో వెళ్ళడానికి కృషి చేసిన మహనీయుడు అని ఆ మహనీయుని జయంతి ని మా గిరిజనులందరు ఒక వేడుకగా జరుపుకుంటామని ఆయన జయంతి మా ఇండ్లలో ఒక పండగ వాతావరణాన్ని తలపిస్తున్నదని తెలిపారు. అదేవిదంగా ఇంతకు ముందున్న ప్రభుత్వాలకు సేవాలాల్ జయంతి సెలవు దినంగా ప్రకటించాలని మేము ఎన్ని సార్లు విన్న వించినా పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన అభివృద్ధి ని కాంక్షించి ఈ జయంతి రోజు ఒక్క గిరిజన ఉద్యోగులకు సెలవు గా ప్రకటించడం హర్ష దాయకమని ఇందుకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుచున్నామని అన్నారు. ఈ కార్యక్రమం లో కాలనీ వాసులు రాజు నాయక్ బల్ రాం నాయక్, సజ్జయ్, శంకర్,భిక్షపతి, గేమ్య, బాలు, నౌశిలాల్ మరియు మహిళలు పాల్గొన్నారు.



