
viswatelangana.com
March 5th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల ఎస్ఐ -3 శంకరయ్య బుధవారం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగినిపల్లి శివారులో గత నెలలో మామిడితోటలో పేకాట ఆడుతూ ఎనిమిది మంది పట్టు పడగా వారి వద్ద నుండి రూ.23,000 నగదును స్వాధీనం చేసుకొని కోరుట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎనిమిది మందిలో ఏడు మంది సెల్ ఫోన్లు తిరిగి ఇచ్చి బండారు శ్రీనివాస్ సెల్. ఫోన్ మాత్రం ఇవ్వలేదు. శ్రీనివాస్ ఫోన్ తిరిగి ఇవ్వడానికి రూ. 5000 డిమాండ్ చేయగా బండారు శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడు బండారి శ్రీనివాస్ బుధవారం కోరుట్లలో శంకరయ్య ఎస్సై-3కి రూ.5000 ఇస్తుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఏసీబీ డిఎస్పి రమణమూర్తి ఆధ్వర్యంలో వల పని పట్టుకున్నారు



