ఏసీబీ వలలో రాయికల్ ఇంచార్జీ తహశీల్దార్

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ కరీంనగర్ ఇంచార్జీ డిఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఇంచార్జీ తహశీల్దార్ గణేష్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల వివరాలు ప్రకారం రాయికల్ మండలంలోని సింగర్రావు పేట గ్రామానికి చెందిన ఓ రైతు వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం తహశీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించగా తహసిల్దార్ గణేష్ 15 వేల రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ద్వారా డీల్ కుదుర్చుకున్న తహశీల్దార్ పదివేల రూపాయలు మంగళవారం సాయంత్రం డాక్యుమెంట్ రైటర్ నుండి డబ్బులు అందుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా తహశీల్దార్ ను పట్టుకొని పదివేల రూపాయలను సీజ్ చేసినట్లు తెలిపారు. అనంతరం తహశీల్దార్ గణేష్, డాక్యుమెంట్ రైటర్ లను కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరుచనున్నట్లు అధికారులు తెలిపారు



