రాయికల్
ఓం నమశ్శివాయ అని స్మరిస్తూ రథాన్ని లాగిన భక్తులు

viswatelangana.com
March 1st, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో శనివారం రోజున శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో గత మూడు రోజులు మహాశివరాత్రి వేడుకలు మూగిసాయి రథం ముందు ఉత్సవ విగ్రహాల నుంచి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు అంగడి భువనేశ్వర్, అంగడి పరమేశ్వర్, గురులింగ మఠం వినయ్ కుమార్, గురు లింగమఠం విక్రమ్,లు వేదమంత్రాలు చదువగా మంగళ వాయిద్యాలు, డప్పు చప్పులతో చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన భక్తులు ఓం నమశ్శివాయ అని స్మరిస్తూ రథాన్ని లాగుతూ రథోత్సవం గ్రామంలోని పురవీధుల గుండా గ్రామస్తులకు దర్శనమిచ్చి శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, హనుమాన్ భజన మండలి భక్తులు, అన్నదాన కమిటీ సభ్యులు,వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



