కోరుట్ల

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గజ్జెల కాంతం నియామకం హర్షణీయం

ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్

viswatelangana.com

June 13th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర చైర్మన్ గజ్జెల కాంతం ను తెలంగాణ పిసిసి ప్రధాన కార్యదర్శిగా నియామించడం హర్షణీయం అని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ అన్నారు.శుక్రవారం కోరుట్లలోని తన కార్యాలయంలో పేట భాస్కర్ పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అంకిత భావంతో పని చేసిన గజ్జెల కాంతంను గుర్తించిన సోనియా గాంధీ అప్పుడే అప్పటి మంత్రి శంకర్రావు ను పక్కన పెట్టి కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి గా టిక్కెట్ ఇచ్చారని ఓటమి పాలైన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రకటించిన నూతన పిసిసి రాష్ట్ర కమిటీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇచ్చి గౌరవించడం ప్రభుత్వ కేబినెట్ లో స్పీకర్ తో సహా ఐదుగురు దళితులకు అవకాశం కల్పించడం పార్టీకి వున్న చిత్తశుద్ధి అభినందనీయమన్నారు. భవిష్యత్తులో గజ్జల కాంతం మరిన్ని పదవులు పొందాలని తెలంగాణ ఉద్యమంలో ఏ అంశాల సాధనకై పన్నెండు వందల మంది అమరులైనరో అ త్యాగమూర్తుల ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వంతో కలిసి అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు సైతం మిగతా ఉద్యమ కారులను గుర్తించాలని పేట భాస్కర్ కోరారు.

Related Articles

Back to top button