రాయికల్
ఉదార భావం చాటిన యంగ్ స్టార్ యూత్ సభ్యులు

viswatelangana.com
March 17th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
మండలంలోని మైతాపూర్ గ్రామానికి చెందిన యంగ్ స్టార్ యూత్ సభ్యులు ఇబ్రహీంపట్నం మండలంలోని మిచ్చమ్మ చారిటబుల్ ట్రస్టులలోని 13 మంది విద్యార్థులకు రూ.13వేల విలువ గల పాఠశాల యూనిఫామ్, షూ అందజేశారు. అనంతరం విద్యార్థులకు ఒకపూట భోజనాన్ని ఏర్పాటు చేసి వారి ఉదార భావాన్ని చాటుకున్నారు. నిరుపేద విద్యార్థులకు తమ వంతు సహకారం అందించండం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు పురాణం భవాని, ప్రధాన కార్యదర్శి టేకు రాజు యూత్ సభ్యులు లక్ష్మణ్, చంటి, విజయ్, శ్రీను, కనకయ్య పాల్గొన్నారు.



