viswatelangana.com
Date of Publish : 24 October 2024, 4:30 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
కథలాపూర్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా గురువారం ఓపెన్ హౌస్ కార్యక్రమం పోలీస్ స్టేషన్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కథలాపూర్ జడ్పీహెచ్ఎస్ పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు హాజరయ్యారు. వారికి పోలీస్ స్టేషన్లో నిర్వర్తించు వివిధ విధుల గురించి మరియు పోలీస్ స్టేషన్ లో నమోదు చేయు రికార్డుల గురించి నేరాలు, సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించడం జరిగిందని కథలాపూర్ ఎస్సై జి నవీన్ కుమార్ తెలిపినారు. ఇట్టి కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Change News Type