కథలాపూర్
ఘనంగా సామాజిక సేవకుడు శ్రీధర్ పుట్టినరోజు వేడుకలు

viswatelangana.com
March 1st, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన సామాజిక సేవకుడు, రక్తదాత మైస శ్రీధర్ పుట్టినరోజు వేడుకలు శనివారం కథలాపూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పలు కూడళ్ల వద్ద కేకులు కటింగ్ చేసి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. శ్రీధర్ చేసిన సేవలను పలువురు కొనియాడి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొండ ఆంజనేయులు, మండల నాయకులు కోట శంకర్, కడారి స్వామి, జంగం నరేష్, చెట్ పల్లి ప్రసాద్, క్రాంతి, మల్లేష్, రంజిత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.



