viswatelangana.com
Date of Publish : 16 March 2024, 2:04 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
కథలాపూర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని నియామకం లేనట్టేనా?

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బిఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో పరాజయం చెందిన తర్వాత నుండి ఆ పార్టీ పరిస్థితి అయోమయంలో పడిపోయింది పలువురు నాయకులు బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరగా అదే త్రోవలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆ పార్టీకి రాజీనామా చేసినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతాడని అందరూ గుసగుసలాడుతున్నారు. సదరు నాయకుడిని కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు లోకల్ లీడర్లు అభ్యంతరం చెప్పడం డైలామలో పడినట్టు నలుగురు నోట వినిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం చెందిన తరువాత ఇంతకు ముందు ఉన్న అధ్యక్షుడు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటినుండి ఇప్పటివరకు నూతన అధ్యక్షుని నియమించకపోవడం పట్ల బిఆర్ఎస్ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి. బిఆర్ఎస్ పార్టీకి కథలాపూర్ మండల అధ్యక్షుడు లేకపోవడం వల్ల పార్టీ కార్యకర్తలు వారి గోడును ఎవరికి వెల్లబోసుకోవాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. మరి కొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నట్టు వినికిడి. ఇకనైనా మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని నియామకం ఉంటుందా లేదా వేచి చూడాల్సిందే.

Change News Type