కథలాపూర్
కథలాపూర్ యంగ్ స్టార్స్ యూత్ గణేష్ ఉత్సవ కమిటీ ఎన్నిక

viswatelangana.com
September 1st, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండల కేంద్రంలోని యంగ్ స్టార్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే 24వ వసంతాల గణేష్ నవరాత్రి ఉత్సవాలో భాగంగా ఉత్సవ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా చెట్ పల్లి ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా బాత్నాతి సంతోష్, ప్రధాన కార్యదర్శిగా బండి శశి కుమార్, కోశాధికారి గా వాసం సిద్ధివినాయక్, కమిటీ సభ్యులుగా గణేష్, వంశీ, విష్ణు, సంతోష్, సాయి, నవీన్, శివాన్ష్ ను ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడు చెట్ పల్లి ప్రసాద్ మాట్లాడుతూ 24వ వసంతల గణేష్ ఉత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా సనాతన ధర్మం ఉట్టిపడే విధంగా నిర్వహిస్తామని తెలిపారు.



