కథలాపూర్
కథలాపూర్ లో కాంగ్రెస్ నాయకుల సంబరాలు

viswatelangana.com
December 9th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలంలో సోమవారం కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. వేములవాడ మాజీ ఎమ్మెల్యే రమేశ్ బాబు భారత పౌరుడు కాదంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో.. ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విజయం సాధించారని నాయకులు టపాసులు కాల్చారు. బస్టాండ్ వద్ద ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. న్యాయం గెలిచిందంటూ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.



