కనుమరుగవుతున్న విశ్వబ్రాహ్మణ కళాకారుల కుటుంబాలు

viswatelangana.com
చేతివృత్తులతో, జీవనం కొనసాగిస్తున్న విశ్వ బ్రాహ్మణ ఉపకులాలు కమ్మరి, వడ్రంగి, స్వర్ణకారులు, కంచరి, కాశి, కుటుంబాల జీవన మనుగడ అస్తవ్యస్తముగా ఉందని, వృత్తిని నమ్ముకున్న యువ కళాకారుడు కత్తిరాజ్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన మాట్లాడుతూ ఈ పోటీ యాంత్రిక పద్ధతులతో కుల వృత్తులకు ప్రాధాన్యం తగ్గి చేసేందుకు పనులు లేక ఆధునిక ప్రపంచంలో రెడీమేడ్ వస్తువుల తయారీ అధికామవడంతో చేతివృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న విషగురువుగా పరిఢవిల్లిన విశ్వకర్మల జీవితాలు బుగ్గిపాలు అవుతున్నాయని, కత్తి మీద సాములా వారి మనుగడ సాగుతోందని అన్నారు ఈ వృత్తులనే నమ్ముకున్న సోదరులు అసువులు బాసారని, కోరుట్ల పట్టణంలో గత రెండు మూడు నెలల వ్యవధిలో ఇద్దరు ఆత్మహత్యలకు దారి తీయడం చాలా బాధాకరమని వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదు కోవాలని అలాంటి బలవన్మరణాలు పొందిన కుటుంబాలను ఆదుకోవాలని, ఇలాంటి సంఘటనలో ముందు ముందు జరగకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని విశ్వబ్రాహ్మణుల జీవితాలు నాశనం కాకుండా వారి కుటుంబాలలో వెలుగులు నింపాలని సాటి విశ్వబ్రాహ్మణునిగా కతిరాజ్ శంకర్ ప్రభుత్వాన్ని కోరారు.



