కలెక్టర్‌ను కలిసిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్

viswatelangana.com
జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన పలు కీలక అంశాలను సమర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న డిఎంఎఫ్టి (DMFT) నిధులను త్వరితగతిన మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మౌలిక వసతులు అందించడంలో ఈ నిధులు కీలకంగా ఉపయోగపడతాయని తెలిపారు. ఇటీవలి కాలంలో కోరుట్లలో వినాయక విగ్రహాల తరలింపులో విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయిన అల్వాల వినోద్ కుటుంబాన్ని ఆయన ప్రస్తావించారు. బాధితుడి కుటుంబం పూర్తిగా నిరుపేద కుటుంబమని, వినోద్ భార్య శైలజకు ఉద్యోగ అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే కోరారు. అదేవిధంగా, మద్దెల చెరువులో ఉన్న గుర్రపు టెక్కను తొలగించి చెరువు శుభ్రపరిచే చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యారంగాన్ని బలోపేతం చేయాలన్న దృష్టితో, కోరుట్ల మరియు మెట్పల్లి లైబ్రరీలలో పుస్తకాలు, చదవడానికి అనువైన కుర్చీలు, ఇతర అవసరమైన సామగ్రిని అందించాలని ఎమ్మెల్యే కలెక్టర్ ని కోరారు.



