కోరుట్ల

కల్లూరు మోడల్ స్కూల్లో సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్టాపన

viswatelangana.com

August 31st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల మండలంలోని కల్లూరు మోడల్ స్కూల్లో శనివారం సరస్వతి దేవి విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేసారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందం ప్రిన్సిపల్ నరసయ్య, అలాగే గ్రామ మాజీ సర్పంచ్ వనతడుపుల అంజయ్య తో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థిని కోరుట్ల పట్టణానికి చెందిన శృంగారపు ప్రగతి, వారి తల్లిదండ్రి అలాగే జ్యోతి కుటుంబ సభ్యులు, అలాగే మరి కొందరు విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. విగ్రహ ఏర్పాటులో ఉన్న వారందరికీ మాజీ సర్పంచ్ అంజయ్య వారికి అభినందనలు తెలిపారు. కార్యక్రమం అనంతరం విగ్రహ దాతలు ఐనా పూర్వ విద్యార్థిని శృంగారపు ప్రగతిని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ తో పాటు గ్రామ మాజీ సర్పంచ్ అంజయ్య, గుగ్గిళ్ళ తుకారాం, పి విజయ్ లు శాలువాతో సత్కరించారు.

Related Articles

Back to top button