మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు

viswatelangana.com
తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మ నిస్తారని మున్సిపల్ చైర్మన్ లయన్ మోర హన్మాండ్లు అన్నారు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు రవి, శశికాంత్ రెడ్డి, ఉదయ్ కుమార్, వాణి, రజిత లను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యరంగంలో డాక్టర్ల నిస్వార్థ, అమూల్యమైన సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు అనంతరం నేషనల్ పోస్టల్ వర్కర్స్ డే సందర్భంగా రాయికల్ పోస్ట్ ఆఫీస్ ఉద్యోగస్తులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్ సి కాటిపెల్లి రామ్ రెడ్డి,మాజీ డిసీలు మ్యాకల రమేష్, బత్తిని భూమయ్య, అధ్యక్షులు కొమ్ముల ఆదిరెడ్డి, కోశాధికారి గంట్యాల ప్రవీణ్, ఎలక్టెడ్ అధ్యక్షులు మచ్చ శేఖర్, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల నరేష్, కోశాధికారి కట్ల నర్సయ్య, మాజీ అధ్యక్షులు కొమ్ముల ఆదిరెడ్డి, ఎద్దండి దివాకర్ రెడ్డి, దాసరి గంగాధర్, లయన్స్ క్లబ్ సభ్యులు వాసం ప్రసాద్, కొయ్యేడి మహిపాల్ రెడ్డి, కటకం కళ్యాణ్, కొత్తపెళ్లి రంజిత్ కుమార్, ఆడెపు రాంప్రసాద్, బొమ్మ కంటి నవీన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు



