కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టిన బిజెపి నేత డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు

viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేములవాడ బిజెపి నాయకులు డాక్టర్ చెన్నమవేని వికాస్ రావు మాట్లాడుతూ ఎండిన ధాన్యాన్నే సకాలంలో కొనుగోలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని కొంటా మని మొక్కుబడి హామీలిస్తున్నదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయ కపోతే రోడ్డెక్కి ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఇటీవల కురుస్తున్న వర్గాలకు ధాన్యం తడిసిపోయిందని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బాధ్యత ప్రభుత్వానిదే అని అధికారులు నిర్లక్ష్యం మూలంగా ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. రైతు భరోసా, రుణమాఫీ వంటివి వెంటనే అమలు చేయాలని కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మరణిం చిన యాటకర్ల అమృత కుటుంబాన్ని పరామర్శించారు. పోసానిపేట గ్రామంలో నాయకులతో కలిసి ముచ్చటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. ఈ కార్యక్రమంలో కంటే సత్యనారాయణ, రాచమడుగు శ్రీనివాస్ రావు,ముంజ శ్రీనివాస్ గౌడ్,గాంధారి శ్రీనివాస్, మల్యాల మారుతి, కాసోజి ప్రతాప్, కోడిపెల్లి అనీల్ రెడ్డి, ధర్మపురి జలంధర్, ముస్కరి కిషోర్, పాలేపు నరేష్, బండ రాజం, కల్లూరి నడిపి మల్లేశం, గొల్లపల్లి మల్లయ్య, పడకంటి శ్రీధర్, యాటకర్ల అశోక్, ప్రవీణ్ గౌడ్, జలంధర్ రెడ్డి తదితరులు నాయకులు పాల్గొన్నారు.



