కోరుట్ల
కాముడు పౌర్ణమి సందర్భంగా ధర్మారంలో సర్వ రోగ నివారిణి మందు పంపిణీ
viswatelangana.com
March 25th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ధర్మారం గ్రామంలో ప్రతి సంవత్సరం కాముడు పౌర్ణమి సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో సర్వ రోగ నివారిణి మందు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఈ మందును మోదుక ఆకు, నువ్వుల నూనె లో మాత్రమే స్వీకరించాలని ఈ మందు సర్వ రోగాలకు పని చేస్తుందని మరియు నువ్వుల నూనె మరియు మోదుక ఆకులు ఉచితంగా ఇస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. ధర్మారం లో చుట్టు ప్రక్కల ప్రాంతం వారు మరియు ఇతర జిల్లా ప్రజలు ఇట్టి మందు ను సేవించి కామ దహనం చుట్టూ ప్రదక్షిణ చేయడం జరిగింది.



