కథలాపూర్
కాలువను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ విప్

viswatelangana.com
June 16th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలం భూషణ్ రావు పేట, కోనాపూర్ మధ్యగల రాళ్ళ వాగు ప్రాజెక్టు ను గత నెలలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సందర్శించిన విషయం తెలిసిందే.. అనంతరం అధికారులు ప్రాజెక్టు మరమ్మత్తుల చేపట్టడం జరిగింది.. రాళ్ళవాగు ప్రాజెక్టు నుండి కథలాపూర్ మండలం భూషణ్ రావు పేట గ్రామంలోని తాళ్లచెరువులోకి, కథలాపూర్ మండల కేంద్రంలో మోడల్ స్కూల్ పక్కగా సిరికొండ గ్రామంలోని నల్లచెరువులోకి రాళ్లవాగు నీరు చెరడం జరిగింది.. సోమవారం ప్రభుత్వ విప్ కాలువను పరిశీలించి కాలువలోనీ పిచ్చి మొక్కలను తొలగించాల్సిందిగా అధికారులకు సూచించారు..



