viswatelangana.com
Date of Publish : 10 February 2024, 3:40 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
కువైట్ కాంగ్రెస్ నాయకురాలికి అభినందన.
featured

మేడిపల్లి ప్రతినిధి: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి), ప్రవాస భారతీయుల విభాగం (ఎన్నారై సెల్), కువైట్ కో-కన్వీనర్ గా ఇటీవల నియమితులైన కళ్యాణి చొప్పల ను తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, టిపిసిసి ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి శనివారం హైదరాబాద్ లో అభినందించారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) వారు ప్రచురించిన వలస కార్మికుల హక్కుల పుస్తకాన్ని ఈ సందర్బంగా వారు ఆమెకు బహుకరించారు.  సింగిరెడ్డి నరేష్ రెడ్డి మాట్లాడుతూ గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది తాత్కాలిక బడ్జెట్ కాబట్టి రెండు మూడు నెలల్లో ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ లో ప్రభుత్వం తగిన నిధులు కేటాయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల ప్రమాద బీమా పథకంలో సహజ మరణాన్ని కూడా చేర్చాలని కోరారు.

Change News Type